Verse 1
Reference: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన Psalm 23
Chorus
యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట
Verse
పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును
Verse
మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును
అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
Verse
శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను