Verse
యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే
నా ప్రతి యాశను తీర్చుకొందును
Verse
నీవే నాకు జీవాహారము
నిన్ను సమీపించు వారే మాత్రము
ఆకలి గొనరిల ఆదర్శుడవు
Verse
నీ మందిర సమృద్ధి వలన
నా మది నెప్పుడు తృప్తి పొందితిని
ఆనంద జలమును త్రాగించుచున్నావు
Verse
నీవే నాకు జీవపు మార్గము
నీ సన్నిధిని పూర్ణానందము
కలదని నిన్ను ఘనపరచెదను
Verse
ఆశతో నిండిన నా ప్రాణమును
ఆకలి గొనిన నాదు ఆత్మను
మేలుతో నీవు తృప్తిపరచితివి
Verse
నీ సంతోషము నాకొసగితివి
నా సంతోషము పరిపూర్ణముగా
కావలయునని కోరిన ప్రభువా
Verse
నా జీవిత కాలమంతయును
నీ ఆలయములో నివసించుచు
హల్లెలూయ పాటను పాడెద ప్రభువా