Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuni Sankalpamulu Maaravu Ennatiki

యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి

Yesu Prabhuni Sankalpamulu Maaravu Ennatiki

Chorus
యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు
Verse
మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప
చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో
త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ
Verse
కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె
ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె
దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె
Verse
మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే
సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె
మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్
Verse
నావన్నియును నీవెగదా అమరుడవగు దేవా
నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి
మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు
Verse
పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టి
పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు

Related Tags

WorshipFaithDevotional