Verse
యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను
అందరము – విజయ గీతములు పాడెదము
విజయ గీతములు పాడెదము
Verse
మన శ్రమలలో విజయమునిచ్చెన్
తన రాజ్యమునందు మనలను చేర్చును‖ 2x ‖
ఘన విజయమును మనకై పొందెన్‖ 2x ‖
మన విజయము యేసే అని హర్షించెదము‖ 2x యేసు ‖
Verse
మనమాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను‖ 2x ‖
సంఘమునకు శిరస్సాయనే‖ 2x ‖
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము‖ 2x యేసు ‖
Verse
మహోన్నతుడు మహా ఘనుడు
మహిమ రాజు మనకు విజయమునిచ్చే‖ 2x ‖
మరణము గెల్చి తిరిగి లేచే‖ 2x ‖
ఆర్భాటముతో హర్షించెదము‖ 2x యేసు ‖