Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuve Neeku Rakshana Nichchunu

యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును

Yesu Prabhuve Neeku Rakshana Nichchunu

Verse
యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును
ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు
Verse
మృతియే పాపపు జేవము - ప్రభుని వరము జీవము
క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడినిన్ కొనెగదా
మరతువా యేసుని ప్రేమను - మరువకు
Verse
కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను
Verse
మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్
మరణ భయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో
Verse
సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే
Verse
దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము
Verse
దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను
Verse
పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూని
దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ

Related Tags

InvitationGospelSalvation