Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuve Saathaanu Balamunu Jayinchenu

యేసు ప్రభువే సాతాను బలమును జయించెను

Yesu Prabhuve Saathaanu Balamunu Jayinchenu

Verse
యేసు ప్రభువే సాతాను బలమును జయించెను‖ 1x ‖
అందరము‖ 1x ‖
విజయగీతములు పాడెదము‖ 2x ‖
Verse
దావీదుకు చిగురు నీవై
యూదా గోత్రపు సింహము నీవై
దేవా నీవే గ్రంథము విప్ప
జయమొందితివి నీకే స్తోత్రములు
Verse
మన శ్రమలలో విజయము నిచ్చున్
తన రాజ్యమునందు మనలను చేర్చున్
ఘన విజయమును మనకై పొందెన్
ఘన విజయము యేసేయని హర్షించెదము
Verse
మనలనెంతో ప్రేమించెను
తనయులముగ జయము పొందితిమి
సర్వములో విజయమిచ్చిన
సర్వేశ్వరుండా నీకే జయము
Verse
మన మాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను
సంఘమునకు శిరస్సాయనే
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము
Verse
మహోన్నతుడు మహా ఘనుడు
మహిమరాజు మనకు విజయమునిచ్చె
మరణము గెల్చి తిరిగి లేచె
ఆర్భాటముతో మనము హర్షించెదము

Related Tags

VictoryResurrectionEaster