Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuvegaaka Vasudhalo Rakshakude Ledu

యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు

Yesu Prabhuvegaaka Vasudhalo Rakshakude Ledu

Verse
ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అపొస్తలుల కార్యములు Acts 4:12
Chorus
యేసు ప్రభువేగాక - వసుధలో రక్షకుడే లేడు
Verse
సార్వత్రికమున సర్వజగమున
వెదకిన గాని వేసారినను
Verse
బైబిలు చూపెడు జీవమార్గము
భువిలో నెచ్చట కనుగొన లేము
Verse
కులములు స్వార్థుల కల్పన గాని
పరలోక మిడిన పద్ధతి గాదు
Verse
తిరిగెదవేల పొరపాటులలో
త్వరపడి సత్యము జేరుము నేడే
Verse
యేసుకు నేను నివాసము కాగా
సుస్థిరమాయెను నా రక్షణ
Verse
మానవజీవిత మనియెడు నావ
పాప భరితమై మునిగెడు వేళ
Verse
స్వయంకృషులు సహస్రములు
చేసినను దోషము పోదు
Verse
యేసులో గాక మోక్షము లేదు
మరువకు మనసా కరుణామయుని

Related Tags

GospelSalvationTruth