Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Premane Chupiddam Yesu Laagane Jeeviddam

యేసు ప్రేమనే చూపిద్దాం యేసు లాగనే జీవిద్దాం

Yesu Premane Chupiddam Yesu Laagane Jeeviddam

Verse
యేసు ప్రేమనే చూపిద్దాం. యేసు లాగనే జీవిద్దాం
లోకాన్నే మార్చుద్దాం. చలో.
యేసు వార్తనే చాటేద్దాం నశించు ఆత్మను మార్చేద్దాం
యేసు సువార్తను ప్రకటిద్దాం. బోలో.
యేసయ్య సాక్షిగా జీవించుదాం తన చిత్తం నెరవేర్చుదాం‖ 2x ‖
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం.‖ 2x ‖
Verse
యేసయ్యనామం ముక్తికి మార్గం యేసయ్య సన్నిధి సంతోషం
యేసయ్య వాక్యం జీవాహారం యేసయ్యే మనకు ఆధారం
Verse
యేసయ్య చరణం పాపికి శరణం యేసయ్య చిత్తం చిరజీవం
యేసయ్యే మార్గం సత్యం జీవం యేసయ్య వలనే పరలోకం
యేసయ్య రాకకు సిద్ధపడుదాం ఆత్మలను సిద్ధపరచుదాం‖ 2x ‖
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం‖ 2x ‖

Related Tags

GospelEvangelismDiscipleship