Chorus
యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీ స్తేను పునరుత్థానమాయెను
యేసు పునరుత్థానమాయె దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ
భక్తలంబర వాసులుగఁ దాఁజేయు నిప్పుడు‖ యేసు ‖
Verse
బేధపడి యా సిల్వమీఁదను దుష్టాత్మ లాయన నాదరంబుగఁ బట్టి
మోదను పాదుకొని ప్రేమన్మతిన్పరి పంధి జనుల గావుమంచును
సాదరంబుగ వేఁడె తండ్రిని శత్రులను రక్షింప నిప్పుడు‖ యేసు ‖
Verse
దుష్టజను లేతెంచుచున్నారు నన్నుఁబట్టి చాలఁగ గష్టపెట్టఁ దలంచు
కొన్నారు విష్టపంబున సిల్వమీఁదను వేదన క్రూరముగ బెట్టుచు
భ్రష్టులైనను బాసిమీరఁక పారిపోయెదరంచు నిప్పుడు‖ యేసు ‖
Verse
ఆమహిన్పరి శుద్ధవంతుఁడై జన్మించె దేవుని నీయందున నీతిమంతుఁ
డై యీ మహిని బోధింప దోష వి హీనుఁడైన నిరపరాధిని స్వామి
ద్రోహిగ నెంచి యూదులు చంపి పూడిచిపెట్ట నిప్పుడు‖ యేసు ‖