Verse
యేసు పుట్టెను రక్షనొచ్చెను
నిత్య జీవమే మనకు ఇచ్చెను
పాపలు పోగొట్టగా – మనకు మార్గమే చూపించగా
దివినుండి భువికేగెను
Chorus
జన్మించినాడయ్యా – మహా మహిమగల యేసయ్యా
అందరికీ రక్షకుడయ్యా – స్తుతి ఆరాధన చేద్దామయ్యా
Verse
నీకున్న కష్టాలన్నీ నీకున్న బాధలన్నీ
తీర్చగలడు యేసయ్య శక్తిగల వాడయ్యా
Chorus
యేసు రాజులకే రాజయ్యా
యేసు ప్రభువులకే ప్రభువయ్యా
Verse
పరలోకం చేరాలంటే యేసుతో ఉండాలంటే
నమ్మాలి హృదయంలో సంపూర్ణ విశ్వాసంతో
Chorus
యేసు రాజులకే రాజయ్యా
యేసు ప్రభువులకే ప్రభువయ్యా