Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Puttukoloni Paramaardhaanni Grahinchi

యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి

Yesu Puttukoloni Paramaardhaanni Grahinchi

Verse
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం
Chorus
పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయా‖ 2x పరమ దైవమే ‖
Verse
ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను – దాసునిగను మారెను –‖ 2x ‖
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…‖ పరమ దైవమే ‖
Verse
అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను‖ 2x ‖
భూలోకమును చేరెను – యేసు రాజుగా…‖ పరమ దైవమే ‖
Verse
నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను –‖ 2x ‖
సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…‖ పరమ దైవమే ‖

Related Tags

SalvationChristmasNativity