Verse
యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా‖ 2x యేసు రాజ ‖
Verse
తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో‖ 2x ‖
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని‖ యేసయ్యా ‖
Verse
పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో‖ 2x ‖
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని‖ యేసయ్యా ‖