Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Raajaa Neeke

యేసు రాజా నీకే

Yesu Raajaa Neeke

Lyricist: Bunny Sudarshan
Verse
యేసు రాజా నీకే
ఈ స్తుతి ఆరాధన
నా యేసు రాజా నీకే
నా స్తుతి సంకీర్తన
ఆరాధన స్తుతి ఆరాధన
సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ‖ 2x యేసు ‖
Verse
నీ మాటలో కరుణ
నీ చూపులో ఆదరణ
నీ ప్రేమలో రక్షణ
నీ కుడి చేతిలో దీవెన‖ 2x ‖
నీతోనే నిత్యానుబంధము
నీవే నా జీవిత గమ్యము‖ 2x ఆరాధన ‖
Verse
జలములలో నే వెళ్లినా
అగ్నిలో నడిచినా
సుడి గాలులే ఎదురైనా
పెను తుఫానే చెలరేగినా‖ 2x ‖
నీ నామమే నను ధైర్యపరచును
నీ మాటలే నన్నాదరించును‖ 2x ఆరాధన ‖

Related Tags

PraiseWorshipDevotional