Verse
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే‖ యేసు ‖
Verse
యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా‖ 2x ‖
భయము లేదు జయము మనదే‖ 2x ‖
విజయ గీతము పాడెదము‖ 2x హోసన్నా ‖
Verse
శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా‖ 2x ‖
యేసు గాయముల్ స్వస్థపరచున్‖ 2x ‖
రక్తమే రక్షణ నిచ్చున్‖ 2x హోసన్నా ‖
Verse
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ‖ 2x ‖
యేసు రాజు మనకు ప్రభువై‖ 2x ‖
త్వరగా వచ్చుచుండె‖ 2x హోసన్నా ‖