Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Raajugaa Vachchuchunnaadu

యేసు రాజుగా వచ్చుచున్నాడు

Yesu Raajugaa Vachchuchunnaadu

Lyricist: Veedhi Eliya
Verse
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు‖ 2x ‖
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు‖ 2x ‖
రారాజుగా వచ్చు చున్నాడు‖ 2x యేసు ‖
Verse
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు‖ 2x ‖
లోకమంతా శ్రమకాలం‖ 2x ‖
విడువబడుట బహుఘోరం‖ యేసు ‖
Verse
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది‖ 2x ‖
ఈ సువార్త మూయబడున్‌‖ 2x ‖
వాక్యమే కరువగును‖ యేసు ‖
Verse
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును‖ 2x ‖
నీతి శాంతి వర్ధిల్లును‖ 2x ‖
న్యాయమే కనబడును‖ యేసు ‖
Verse
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును‖ 2x ‖
వంగని మోకాళ్ళన్నీ‖ 2x ‖
యేసయ్య యెదుట వంగిపోవును‖ యేసు ‖
Verse
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు‖ 2x ‖
రెప్ప పాటున మారాలి‖ 2x ‖
యేసయ్య చెంతకు చేరాలి‖ యేసు ‖

Related Tags

Second ComingRaptureJesus