Verse
యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?
నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?
Chorus
యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా
పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము
Verse
లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?
నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా?
Verse
ఇంక తామసించినచో - వెనుక మోసమగును
ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షనబ్బదు
Verse
పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము
నీదు జీవబలముల - నేడే సమర్పింపుము
Verse
రేపు యని తామసింప - నష్టము సల్గు సదా
మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు
Verse
యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము
దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే
Verse
హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా
త్రోసివేయడెన్నడును - మంచి యేసునాథుడు