Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Raajyamunaku Sainikulam

యేసు రాజ్యమునకు సైనికులం

Yesu Raajyamunaku Sainikulam

Lyricist: Sayaram Gattu
Verse
యేసు రాజ్యమునకు సైనికులం
పరమునకు మనమే వారసులం‖ 2x ‖
ప్రేమ పంచిన దేవుని శిష్యులం
ఎదురు బెదురూ ఎరుగని వారలం‖ 2x ‖
Verse
కారు చీకటి కమ్మిన లోకము
కాదు మన ప్రభువుకు సమ్మతము
ఆత్మలు నశియించుట ఘోరము
వారి రక్షణయే మన భారము‖ 2x ‖
వెలుగే మనమని సెలవిచ్ఛేనని
అప్పగించిన పని జరిగింతుము‖ 2x ప్రేమ పంచిన ‖
Verse
వలదు నీ మదిలో సందేహము
ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
తగిన రీతి తలాంతులు నొసగును
నిన్ను అద్భుత పాత్రగా మలచును‖ 2x ‖
నీకు భారము మదిలో మెదిలితే
ప్రభువే మార్గము చేయును సరళము‖ 2x ప్రేమ పంచిన ‖
Verse
నీవు పొందిన సువార్త ఫలము
ఇతరులకు పంచుటయే ఘనము
సాక్ష్యమును చాటించే ధైర్యము
లోకమునకు చూపించును నిజము‖ 2x ‖
కోత ఎంతగ ఉంది విరివిగా
కోయుదాము ప్రభు పనివారుగా‖ 2x ప్రేమ పంచిన ‖

Related Tags

GospelEncouragementService