Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Rajuga Vachuchunnadu

యేసు రాజుగా వచ్చుచున్నాడు

Yesu Rajuga Vachuchunnadu

Chorus
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకుంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు‖ 2x ‖
రారాజుగా వచ్చుచున్నాడు యేసు‖ 2x ‖
Verse
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు‖ 2x ‖
లోకమంతా శ్రమకాల విడువబడుట బహుగోరం‖ 2x యేసు ‖
Verse
ఏడేళ్ళ పరిశుద్ధులకు విందౌ బోతుంది
ఏడేళ్ళ లోకము మీదకి శ్రమరాబోతుంది‖ 2x ‖
ఈ సువార్త మూయబడున్‌ వాక్యమే కరువగును‖ 2x యేసు ‖
Verse
వెయ్యేళ్ళ ఇలపై యేసురాజ్యమేలును
ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును‖ 2x ‖
నీతి శాంతి వర్ధిల్లున్‌ న్యాయమే కనబడును‖ 2x యేసు ‖
Verse
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించున్‌ గడగడలాడును‖ 2x ‖
వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును‖ 2x యేసు ‖
Verse
సోదరుడా మరువద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగా నుండి‖ 2x ‖
రెప్పపాటులో మారాలి యేసయ్య చెంతకు చేరాలి‖ 2x యేసు ‖

Related Tags

Second ComingEnd TimesJesus Christ