Verse
యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను‖ 2x ‖
నా సమస్తము అర్పించి ఆరాధించెదను‖ 2x ‖
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
Verse
శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు‖ 2x ‖
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు‖ 2x ‖
చల్లని దేవుడు నా చక్కని యేసుడు‖ 2x యేసు రక్షకా ‖
Verse
పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు‖ 2x ‖
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు‖ 2x ‖
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు‖ 2x యేసు రక్షకా ‖
Verse
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం‖ 3x యేసు ఆరాధించెదను ‖