Chorus
యేసు రక్తమే జయము
పరిశుధ్ధ రక్తమే జయము‖ 2x ‖
నా కొరకూ మానవులందరి కొరకు
కార్చిన రక్తముకే జయము‖ 2x యేసు రక్తమే ‖
Verse
యెరుషలేము వీధులలో చిందించిన రక్తము
పాపుల కొరకై కార్చబడిన రక్తము‖ 2x ‖
ప్రేమకు ప్రతిరూపముగా కార్చబడిన రక్తము
పరిపూర్ణతకై చిందించిన రక్తము‖ 2x యేసు రక్తమే ‖
Verse
కల్వరి సిలువపై చిందించిన రక్తము
చివరి బొట్టు వరకు కార్చబడిన రక్తము‖ 2x ‖
చీకటిని తొలగించుటకై చిందించిన రక్తము
వారసత్వమిచ్చుటకై కార్చబడిన రక్తము‖ 2x యేసు రక్తమే ‖