Verse
యేసు రక్తము రక్తము రక్తము‖ 2x ‖
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము‖ యేసు రక్తము ‖
Verse
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము‖ 2x ‖
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే‖ 2x యేసు రక్తము ‖
Verse
మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము‖ 2x ‖
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను‖ 2x యేసు రక్తము ‖
Verse
మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము‖ 2x ‖
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను‖ 2x యేసు రక్తము ‖