Verse
యేసు రక్తములో నాకు జయమే జయము
ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం‖ 2x ‖
జయం జయం జయం జయం – నా యేసునిలో
జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో‖ 2x యేసు రక్తములో ‖
Verse
పాపాలను క్షమియించి – శాపాలను భరియించి
విడుదలను కలిగించే యేసు రక్తము
మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి
పరలోకానికి చేర్చే యేసు రక్తము‖ 2x ‖
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది‖ 2x జయం జయం ‖
Verse
శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి
ఆదరణను కలిగించే యేసు రక్తము
రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి
స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము‖ 2x ‖
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది‖ 2x జయం జయం ‖