Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Saami Neeku Nenu Naa Samasta Mittu

యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తు

Yesu Saami Neeku Nenu Naa Samasta Mittu

Chorus
యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము
Verse
యేసు సామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే
Verse
నేను నీవాడను యేసు నీవును నావాడవు
నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము
Verse
నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే
Verse
యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా హాల్లెలూయా స్తోత్రము

Related Tags

WorshipSurrenderDevotion