Verse
యేసు సమాధిలో - పరుండి
వాసిగా మూడవ - నాడు లేచెన్
లేచెన్ సమాధినుండి - మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై - నిత్యం జీవించ
మధ్యవర్తియై - లేచెను! లేచెను! హల్లెలూయ!
Verse
వ్యర్థమే కావలి - సమాధియొద్ద
వ్యర్థంబు ముద్రయు - యేసు ప్రభూ!
Verse
మృత్యుబంధంబులన్ - నిత్యుండు త్రెంచెన్
స్తుత్యుందు జయించెన్ - జయమో జయం