Verse
యేసు సమాధిలో
పరుండియుండి
వాసిగ మూఁడవ
నాఁడు లేచెన్.‖ లేచెన్ ‖
Chorus
లేచెన్ సమాధినుండి
మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై
నాత్యముం జీవించ
మధ్యవర్తియై;
లేచెను! లేచెను
హల్లెలూయ! లేచెను‖ లేచెను ‖
Verse
వ్యర్థమే కావలి
సమాధియొద్ద
వ్యర్థంబు ముద్రయు
యేసూప్రభూ!
Verse
మృత్యుబంధంబులన్
నిత్యుండు త్రెంచెన్
స్తుత్యుండు జయించెన్
జయం! జయం!