Intro
యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….
Verse
యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
మానవుల రక్షించే మహా దేవుడా‖ 2x ‖
నశియించినదానిని వెదకి రక్షించినావా‖ 2x ‖
చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా‖ 2x ‖
వందనమయ్యా నీకు వందనమయ్యా
యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా‖ 2x ‖
Verse
కానాను పురమున కళ్యాణ సమయాన‖ 2x ‖
నీటిని ద్రాక్షా రసముగ మార్చి
విందును పసందుగా మార్చినావు‖ 2x వందనమయ్యా ‖
Verse
నాయీను గ్రామాన విధవరాలి కుమారుని‖ 2x ‖
పాడెను ప్రేమతో ముట్టి
కన్నతల్లి కన్నీరు తుడిచినావు‖ 2x వందనమయ్యా ‖
Verse
గెరాసేను దేశాన సమాధుల స్థలములోన‖ 2x ‖
సేన దయ్యమును వదిలించి
నశియించే ఆత్మను రక్షించినావు‖ 2x వందనమయ్యా ‖