Chorus
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే
ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవి
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్
Verse
పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెను
జనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది
Verse
భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవి
ఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు
Verse
విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చును
యేసునితో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు
Verse
మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమని
ఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు