Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Sheeghramugaa Vachchun Aashathoa Kanipettudi

యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి

Yesu Sheeghramugaa Vachchun Aashathoa Kanipettudi

Verse
యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి
Verse
గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్
పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి
Verse
ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో
ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి
Verse
సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప
సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి
Verse
పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి
మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి
Verse
యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్
మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి
Verse
వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి
పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి
Verse
మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల
సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి

Related Tags

Second ComingEnd TimesWatchfulness