Verse
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన
గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు‖ యేసు ‖
Verse
యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు
దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను
చంపుదు రని‖ యేసు ‖
Verse
నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప
హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును‖ యేసు ‖
Verse
మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన
రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని‖ యేసు ‖