Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Thrupthi Parachithivi Aashatho Nee Charanamu Chera

యేసు తృప్తి పరచితివి ఆశతో నీ చరణము చేర

Yesu Thrupthi Parachithivi Aashatho Nee Charanamu Chera

Verse
యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర
Verse
క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిమి
నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి
Verse
నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి
సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి
Verse
నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని
రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే
Verse
నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివి
మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద
Verse
నిను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే
ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే

Related Tags

WorshipGraceJesus