Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Vachchedi Velaaye Sodarulaara

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా

Yesu Vachchedi Velaaye Sodarulaara

Lyricist: Chedalavada Thomas
Chorus
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోను
భాసురమగుతన నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ‖ యేసు ‖
Verse
నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా
శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు‖ యేసు ‖
Verse
తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు ఘన మహిమలోకి వెళ్లి తన
యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము.‖ యేసు ‖
Verse
చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల
దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ‖ యేసు ‖
Verse
శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుఁడైన
యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు
Verse
మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన
దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత‖ యేసు ‖

Related Tags

Second ComingEnd TimesWatchfulness