Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Varta Chatudam Rammu O Sodara

యేసు వార్త చాటుదాం రమ్ము ఓ సోదరా

Yesu Varta Chatudam Rammu O Sodara

Chorus
యేసు వార్త చాటుదాం రమ్ము ఓ సోదరా
యేసుతోనే సాగుదాం రమ్ము ఓ సోదరీ
అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుష్యునికి
యేసు ప్రేమను చూపించుదాం యేసులోనే నడిపించుదాం
యేసు ప్రేమను చూపించుదాం యేసుతోనే సాగిపోదాం
Verse
నీకై నాకై వచ్చాడన్నా యేసయ్య లోకానికి
నిన్ను నన్ను పిలిచాడన్నా యేసయ్య పనికోసమే
నీ హృదయం ప్రభు కర్పించుము నీ సమయం యేసు కర్పించుము
నీ సకలం ప్రభు కర్పించుము నీ సర్వం యేసు కర్పించుము
Verse
మాట ఇచ్చి స్ధాపించాడు ఈ కల్వరి సహవాసమును
వాగ్దానాలతో నడిపించుచున్నాడు
ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలులుగా మార్చి ఆశీర్వదించెన్
ఎన్నో రీతులుగా పలు పరిచర్యలను సాగించుటకు తన తోడునిచ్చెన్

Related Tags

EvangelismServiceMission