Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Vasthrapu Chengunu Maathrame

యేసు వస్త్రపు చెంగును మాత్రమే

Yesu Vasthrapu Chengunu Maathrame

Lyricist: తూపిలి బెంజిమిన్
Verse
యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల
రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ‖ యేసు ‖
Verse
గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు
తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను‖ యేసు ‖
Verse
అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ
ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు‖ యేసు ‖
Verse
ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ
ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె‖ యేసు ‖
Verse
ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను
ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు‖ యేసు ‖
Verse
ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు
దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును‖ యేసు ‖

Related Tags

FaithHealingMiracles