Chorus
యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ
భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే‖ యేసు ‖
Verse
కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ
కృపలో క్షేమ మున్నది కానరే‖ యేసు ‖
Verse
సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి
బొత్తిగా విడ దీయరే‖ యేసు ‖
Verse
కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని
కర్త యేసుని బోలరే‖ యేసు ‖
Verse
బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన
మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే‖ యేసు ‖
Verse
మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్
ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే‖ యేసు ‖
Verse
సద్దులేకను దేవ సేవ ముద్దుతో ఁ గొని యాడరే హద్దు మీరు విమత
సాతాన్ సుద్దులను ద్యజియింపరే‖ యేసు ‖
Verse
బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును
నమ్మి మీరలు సాధులై వర్తింపరే‖ యేసు ‖