Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Yaathma Priyuda Ninnu

యేసూ యాత్మ ప్రియుఁడా నిన్ను

Yesu Yaathma Priyuda Ninnu

Lyricist: Charles Wesley
Verse
యేసూ, యాత్మ ప్రియుఁడా
నిన్ను నాశ్రయించితి
లేవఁగా దరంగముల్
గాలివాన కొట్టఁగా
లోకబాధ లన్నిఁటన్
నన్ను దాఁచు రక్షకా
రేపునకు నడ్పుము
నాదు యాత్మన్ బ్రోవుము
Verse
దిక్కు లేని యాత్మకు
వేఱె ప్రాపు లేదిఁక
ఒంటిగాను విడ్వక
నన్ను నాదరించుమీ
నిన్నె నమ్మి యుంటిని
నీవె నా సహాయము
కాపులేని నా తలన్
కాయుమా నీ నీడను
Verse
క్రీస్తు నిన్నెఁ గోరుదున్
దొర్కు నన్ని నీ కడన్
పడ్డ హీను నెత్తుమీ
స్వస్థపర్చు రోగులన్
న్యాయశుద్ధ నామము
నీదె, నేను పాపిని
నేను పాపపూర్ణుఁడన్
నీవు ప్రేమారూపివి
Verse
పాపమెల్ల మాన్పఁగా
నీదు ప్రేమ చాలును
మాన్పు నీళ్లు నాయెదన్
శుద్ధి చేయఁగా నిమ్ము
నీవు బ్రత్కు టూటవు
త్రాగనిమ్ము నీదరిన్
పుట్టి నాదు నాత్మలో
నెల్ల ప్రొద్దు పారుమీ

Related Tags

PrayerJesusRefuge