Verse
రక్షకా, నన్ - మర్వబోకు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారిఁబిల్వన్ - మర్వబోకు నన్
Chorus
యేసు, యేసు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్
Verse
నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుము
పశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము
Verse
నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్
క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో
Verse
నాకు సుఖదాత వీవె - జీవదాతవే
ఇహపరములయందు - దిక్కు నీవెగా