Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesudeva Nanu Konipova Ni Rajyamukai

యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై

Yesudeva Nanu Konipova Ni Rajyamukai

Verse
యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా
శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము
Verse
ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి యుంది
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టు దేవా
Verse
నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను

Related Tags

Second ComingDevotionalPrayer