Verse
యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల
కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు‖ యేసు ‖
Verse
తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు
యేసుఁడే మా తండ్రియౌను‖ యేసు ‖
Verse
వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి
దేవ కొమరుఁడే వేరెవరు లేరు‖ యేసు ‖
Verse
దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా
దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్‖ యేసు ‖
Verse
సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ
మోక్షము భువిని రక్తమంత గార్చె‖ యేసు ‖
Verse
ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము
భువిని బలిపెట్టినాఁడు‖ యేసు ‖
Verse
ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి
పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు‖ యేసు ‖
Verse
ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు
సాటి లేశమైనా లేరుసుండీ‖ యేసు ‖