Chorus
యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు
యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును
Verse
అన్నిటికంటె ముందుగ నున్న - అల్ఫాగ తానై యుండి
తనయందు మనల పూర్ణులజేసె - ఓమెగ తానైయుండి
Verse
లోకము పుట్టక మునుపే తాను మహిమలో తండ్రితో నుండె
ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె
Verse
అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై
రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి
Verse
జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న
దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు
Verse
నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు
తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్
Verse
అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్
మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి
Verse
ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ
శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో