Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesukreesthu Prabhuvaa Memu Nee Ma

యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మ

Yesukreesthu Prabhuvaa Memu Nee Ma

Lyricist: Gollapalli Nathaniel
Verse
యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు
లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు‖ యేసు ‖
Verse
పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప
వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు‖ యేసు ‖
Verse
సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు
నీ కృప చాల యిలలోఁ దెల్పితివే‖ యేసు ‖
Verse
అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు
మూఁడవ దినమున బ్రతికియు లేచితివే‖ యేసు ‖
Verse
పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు
ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా‖ యేసు ‖
Verse
దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము
మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు‖ యేసు ‖
Verse
నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద
ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను‖ యేసు ‖

Related Tags

GracePrayerSalvation