Chorus
యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ
యాజ్ఞల నభ్యసింపగ జేయరే‖ యేసు ‖
Verse
పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము
లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే‖ యేసు ‖
Verse
మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి
బిడ్డల నాదరముతో బంపరే‖ యేసు ‖
Verse
యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ
శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు‖ యేసు ‖
Verse
యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి
హృదయము యేసురూపము దాల్చును‖ యేసు ‖
Verse
యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము
వారి యెదలలో నాశతోడను నాటరే‖ యేసు ‖