Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesulo Harshinchedamu Mahimalo Harshinthumu Niratham

యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం

Yesulo Harshinchedamu Mahimalo Harshinthumu Niratham

Chorus
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
మహిమ మహిమ మహిమలో హర్షించెదము
Verse
పరిశుద్ధులు హర్షింప - యేసు త్వరగా రమ్మని పలుక
మారువారికి మకుటం - మనస్సారగ దేవుడిచ్చున్
మహిమ ఘనము మహిమలో నానందింప
Verse
శుద్ధ జీవులైన - దేవసుతులు ప్రకాశింపన్
సర్వ సృష్టియొక్క - మహా కర్మము లన్నియు తీర
రాజుకు మహిమ కలుగు దినములు రాగా
Verse
దాసులెల్లరుకూడి - దేవుడిచ్చు మకుటము పొంది
వేయి సంవత్సరముల్ - రాజ్యమేలుచుండునపుడు
నెమలి, కోకిల, గొఱ్ఱె, పులితో వసించున్
Verse
చెదల పుడమి నశింప - నవభూమ్యాకాశముల్ కలుగ
శాప పాపముల్ సకల - కడురోగము లెల్లను తీర
సుఖము, జయముతో నెల్లరు నానందింప
Verse
బంగారు వీధులను - బహురంగుగా నొప్పుచుండున్
మెరయు వజ్రకాంతుల్ - కూడ నీవు చూచి హర్షింప
క్లేశ, కన్నీరులేని నగరులోన
Verse
స్ఫటిక జీవనదియు - ఇరుప్రక్కల జీవ వృక్షమును
ఆకలిదప్పులు లేక - నట జీవ ఫలముల భుజించి
తినుచు, త్రాగుచు యేసులో నానందింప
Verse
పరిశుద్ధాత్మయు సుతుడు - చేసిన రక్షణ కార్యమును
తండ్రి దూతల గణముల్ - నట చూచి ప్రహర్షింపన్
క్రొత్త కార్యముకొరకు ఆనందింప

Related Tags

PraiseSecond ComingHeaven