Verse
యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే
దుస్సహ వాసమే‖ యేసు ‖
Verse
కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే
పాపపు పలుకులే‖ యేసు ‖
Verse
మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే
దుష్క ర్మంబులే‖ యేసు ‖
Verse
పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే
దోసపు పడకలే‖ యేసు ‖
Verse
దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే
యందను రక్తియే‖ యేసు ‖
Verse
హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే
హృదయదు రేచ్ఛలే‖ యేసు ‖
Verse
పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ
సం దోహమే‖ యేసు ‖
Verse
దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా
ధారుణిఁ గడుతు నా‖ యేసు ‖