Chorus
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ నిటరండు
భాసురముగ ప్రభు జన్మము బాడుచు నాసతోడ రండు వేగమె
యాసతోడ రండు‖ జే జయం ‖
Verse
దూతలమాదిరి గాత్రము లెత్తుచు గీతము బాడుండి వేగము గీతము
బాడుండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుండి వేగమె
ఖ్యాతిగ బలుకుండి‖ జే జయం ‖
Verse
గొల్లల ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుండి వేగమె యెల్లరు
నడువుండి ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లెడ దెలుపుండి వేగమె
యెల్లడ దెలుపుండి‖ జే జయం ‖
Verse
జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుండి వేగమె కానుక
లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె
దానము బొందుండి‖ జే జయం ‖
Verse
మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుండి వేగమె
కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి
వేగమె దానము బొందుండి‖ జే జయం ‖
Verse
జయజయ శబ్దము జేయుచు ప్రభునకు జయమని పాడుండి వేగమె
జయమని పాడుండి జయజయ మంచును జయ శబ్ధముతో జయముల
నొందుండి వేగమె జయముల నొందుండి‖ జే జయం ‖