Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesunaatha Trilokanaatha Lokoddhaaraka Kreesthu Devaa

యేసునాథా త్రిలోకనాథా లోకోద్ధారక క్రీస్తు దేవా

Yesunaatha Trilokanaatha Lokoddhaaraka Kreesthu Devaa

Verse
యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా
చక్కగ దాసుల బ్రోచి రక్షించుము
Verse
అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు
నతిశయముగను పంచిన దేవా
Verse
కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన
కరుణానిథీ నను ప్రేమించు నిత్యము
Verse
నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము
ఆధారమీవే దీనోపకారా
Verse
కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై
సిలువయందు మరణించితివి
Verse
నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర
నీదు దాసుల నాశీర్వదించుము

Related Tags

WorshipDevotional