Chorus
యేసునాధా రారారా మా జీవనాధా రారారా
Verse
దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు‖ యేసు ‖
Verse
నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు‖ యేసు ‖
Verse
నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు‖ యేసు ‖
Verse
పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి‖ యేసు ‖
Verse
లోకపాపమును జయించి లోకుల రక్షించితివి‖ యేసు ‖
Verse
వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి‖ యేసు ‖