Chorus
యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు
దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము‖ యేసు ‖
Verse
లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము
యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము‖ యేసు ‖
Verse
దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప
భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు‖ యేసు ‖
Verse
శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక
వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము‖ యేసు ‖
Verse
నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక
ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము‖ యేసు ‖
Verse
శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత
మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము‖ యేసు ‖