Chorus
యేసుండగా నీకండగా దిగులేల నోసోదరా
యేసుండగా నీకండగా దిగులేల నోసోదరీ‖ 2x ‖
నిను కాపాడి నిను రక్షించుటకు‖ 2x ‖
తన ప్రాణాన్నే అర్పించినాడు‖ యేసుండగా ‖
Verse
నీ నావలో తుఫానులే చెలరేగినా
ఎర్ర సంద్రమే ఎదురు వచ్చినా‖ 2x ‖
ఫరో సైన్యమే తరుముతు ఉన్నా
పగవారే నిన్ను నిందించినా‖ 2x ‖
Verse
నీ యాత్రలో దుఃఖములు ఎన్ని జరిగినా
వేధనలే నిన్ను చుట్టి వేసినా‖ 2x ‖
స్నేహితులే తోసి వేసినా
బంధువులే వదిలి వేసినా‖ 2x ‖