Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesundu Raagan Jesina Doshamu Naasha

యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశ

Yesundu Raagan Jesina Doshamu Naasha

Lyricist: మిక్కిలి ఫ్రెడరిక్
Chorus
యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్‖ యేసుఁడు ‖
Verse
చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస
మాయెన్‖ యేసుఁడు ‖
Verse
సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును
దించెన్‖ యేసుఁడు ‖
Verse
శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును
జూపెన్‖ యేసుఁడు ‖
Verse
పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము
నొసంగెన్‖ యేసుఁడు ‖
Verse
రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్‖ యేసుఁడు ‖
Verse
రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్‖ యేసుఁడు ‖
Verse
గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని
జూపెన్‖ యేసుఁడు ‖

Related Tags

RepentanceSalvationVictory