Chorus
యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ
బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని
దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని‖ యేసు ‖
Verse
ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు
వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి
రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు‖ యేసు ‖
Verse
ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు
నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని
నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును‖ యేసు ‖
Verse
లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు
ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను
నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును‖ యేసు ‖
Verse
వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని
సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ
నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా‖ యేసు ‖
Verse
నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ
డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను
విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా‖ యేసు ‖